HomeMovie News Teluguవారణాసి నుంచి మరోసారి లీక్..

వారణాసి నుంచి మరోసారి లీక్..

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. భారీ యాక్షన్ ఎపిసోడ్లతో ఈ సినిమా తెరకెక్కుతుండగా, మరోసారి ఈ ప్రాజెక్ట్ లీకుల బారిన పడటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మహేశ్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించిన మొదటి షెడ్యూల్‌కు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో లీక్ కాగా, తాజాగా మరో యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

లీక్ అయిన క్లిప్‌లో మహేశ్ బాబు ఒంటి నిండా రక్తంతో, ఇప్పటివరకు చూడని పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ లీక్‌లను షేర్ చేస్తున్న కొన్ని సోషల్ మీడియా అకౌంట్లను ఇప్పటికే బ్లాక్ చేసినట్లు సమాచారం. అలాగే, అనుమతి లేకుండా సినిమా కంటెంట్‌ను ప్రచారం చేస్తున్న వారిపై చిత్రబృందం లీగల్ చర్యలకు సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మరోవైపు, వరుస లీక్‌లపై మహేశ్ బాబు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లీక్ వీడియోలు బయటకు రావడం కంటే, చిత్రబృందమే అధికారికంగా గ్లింప్స్ లేదా టీజర్ విడుదల చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో రాజమౌళిని ట్యాగ్ చేస్తూ అభిమానులు విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే, ఈ లీక్‌ల వ్యవహారంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ అంశంపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular