టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ విడుదలకు సిద్ధమైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా, కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు.
ఈ సినిమాను ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుండగా, ఒక రోజు ముందుగా ఆగస్టు 6న రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
విడుదల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సినిమా థియేట్రికల్ హక్కుల అమ్మకాలు కూడా పూర్తయ్యాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, నైజాంలో రూ.4 కోట్లు, సీడెడ్‌లో రూ.1.50 కోట్లు, కోస్తా ఆంధ్రాలో రూ.5 కోట్లు పలికినట్లు తెలుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం రూ.10.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.
అదే విధంగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మరో రూ.2 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.12.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదైనట్లు సమాచారం.
దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సుమారు రూ.13.50 కోట్ల షేర్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ సాధించి హిట్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి.





