టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘క’, ‘కే ర్యాంప్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న ఆయన, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కిరణ్ అబ్బవరం, ఈసారి కూడా కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచారం. ఈ చిత్రానికి ‘కాంతార’ ఫ్రాంచైజీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీకాంత్ పుప్పాల దర్శకుడిగా పరిచయం కానున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు ‘ఇంద్రప్రస్థ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టైటిల్‌నే ఆసక్తికరంగా ఉండటంతో సినిమా కథ ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని, ఇదే నెలలో పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
‘కాంతార’ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌కు పనిచేసిన అనుభవం ఉన్న శ్రీకాంత్ పుప్పాల దర్శకత్వం, వరుస హిట్లతో దూసుకుపోతున్న కిరణ్ అబ్బవరం హీరోగా నటించడం వల్ల ఈ కొత్త కాంబినేషన్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, నటీనటులు, సాంకేతిక బృందంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారి కిరణ్ అబ్బవరం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.





