HomeMovie News Teluguనాగార్జున బర్త్‌డేకు సూపర్ ట్రీట్..

నాగార్జున బర్త్‌డేకు సూపర్ ట్రీట్..

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కిస్తున్న ‘KING100’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. నాగార్జున కెరీర్‌లో ఇది 100వ చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ ప్రకటన తర్వాత సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం, ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం అభిమానులకు ప్రత్యేక సర్‌ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఆ రోజు ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు గ్లింప్స్ వీడియోను కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ గ్లింప్స్‌కు దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గతంలో నాగార్జున సినిమాలకు ఎన్నో గుర్తుండిపోయే సూపర్ హిట్ ఆల్బమ్‌లు అందించిన డీఎస్పీ, ఈ చిత్రానికి కూడా అదే స్థాయిలో సంగీతం అందిస్తారనే నమ్మకం అభిమానుల్లో ఉంది.

అయితే ఈ అప్‌డేట్‌పై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే, నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ‘KING100’ నుంచి వచ్చే ఫస్ట్ లుక్, గ్లింప్స్ అభిమానులకు ప్రత్యేక కానుకగా నిలవనున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular